యశవంతపుర(బెంగళూరు): నీ భర్తను వదిలిపెట్టాలంటే నువ్వు నా ఇంటికి రావాలి, లేదా రూ.25 లక్షలను ఇచ్చుకో అని ఓ సీఐ మహిళను వేధించిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణాలో జరిగింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడికి పోస్టింగ్ తీసుకున్నట్లు సీఐ సందేశ్ చెప్పాడని ఆ మహిళ పేర్కొన్నారు. నాపై ఫిర్యాదు చేసిన నీ భర్తను అరెస్ట్ చేశా, విడిపించుకోవాలంటే రూ.25 లక్షలు డబ్బులివ్వాలంటూ సీఐ సందేశ్ తనను ఒత్తిడి చేశారని సదరు మహిళ మంగళూరు పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
గత ఆగస్ట్లో తన భర్తను అరెస్ట్ చేశారని, విడుదల చేయాలని సీఐ వద్దకు వెళ్లగా అతడు చెప్పిన మాటలు విని షాక్కు గురైనట్లు మహిళ వాపోయింది. ఈ రాత్రికి పడక గదికి రావాలని అసభ్యకరంగా డిమాండ్ చేశాడని మహిళ ఆరోపించింది. నేను హోంమంత్రికి రూ.50 లక్షలిచ్చి ఇక్కడి వచ్చా, నేను అడిగినంత డబ్బులిస్తేనే విడుదల చేస్తా, లేదంటే నీ భర్తపై రౌడీషిట్ను తెరుస్తానంటూ బెదిరించాడని మహిళ ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది.
Also read
- Vastu Tips: బల్లి మీద పడినా, కలలో కనిపించినా మీ ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?
- భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న తప్పు ఇదే..
- నేటి జాతకములు 18 మార్చి, 2026
- గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతలపాటి వెంకటరామయ్య ఘనంగా (సి.వి.ఆర్) నామినేషన్
- రెండో తరగతి బాలికపై వృద్ధుడి అఘాయిత్యం




