బషీరాబాద్: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం..
ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Also read
- Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
- Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం





