SGSTV NEWS online
Andhra PradeshCrime

ప్రియుడి మోజులో పడి.. 9 నెలల బిడ్డను హత్యచేసి పూడ్చి పెట్టింది



తిరుపతి: తిరుపతిలోని పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19)అనే యువతి తన 9 నెలల బిడ్డను హత్యచేసి, దేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆశాలతకి గతంలో వివాహం అవ్వగా భర్తతో గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త నుండి విడిపోయి కొంతకాలం తన తల్లి వద్దే ఉంది. అయితే ఈ క్రమంలో ఆమెకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఆ ఇద్దరూ సహజీవనంలో ఉంటూ పెళ్లి చేసుకోవాలని సైతం నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని కన్నతల్లే హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చి పెట్టింది. కాగా తన బిడ్డ, మనవరాలు ఈ నెల 19వ తేదీ నుండి కనిపించడంలేదు అంటూ ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. ఆశాలత తన బిడ్డను హత్య చేసినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts