హైదరాబాద్: సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ యువతిని తన కార్యాలయానికి పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిపై ఫిలింనగర్ పోలీ・స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సినీ నటిని కావాలని ఆశతో ఓ యువతి ఇటీవల హైదరాబాద్కు వచ్చి తన స్నేహితురాలి వద్ద ఉంటోంది. ఈ నెల 18న సినిమాల్లో ఛాన్స్ ఉందని, హీరోయిన్ ను చేస్తానంటూ జీఎం రవి అనే యువకుడు ఆమెను మాదాపూర్ కు పిలిపించాడు.
అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెను పలు విధాలుగా పరీక్షించి ఫిలింనగర్ లోని దుర్గాభవానీనగర్ వద్ద ఉన్న గ్రీన్మార్ట్ ఆఫీసుకు సాయంత్రం రమ్మన్నాడు. దీంతో ఆమె తన స్నేహితురాలిని తీసుకుని గ్రీన్మార్ట్ ఆఫీసుకు వెళ్లి రవిని కలిసింది. ఆయన తన గదిలోకి పిలిపించి టెస్ట్ పేరిట అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనతో పాటు తన స్నేహితురాలితో కూడా అనుచితంగా వ్యవహరించాడని, సినిమాల్లో వేషం పేరుతో, తనను పరీక్షల పేరుతో ఇష్టానుసారంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



