వివాహిత ఆత్మహత్య.. పోలీసుపై కేసు
కర్ణాటక: శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలోని హొస సిద్ధాపురలో స్వాతి (27) అనే వివాహిత ఆత్మహత్య కేసులో స్థానిక మాలూరు హెడ్ కానిస్టేబుల్ మోహన్పై కేసు దాఖలైంది. ప్రభుత్వ క్లర్కు అయిన ఆమె భర్త జగదీష్ శివరాత్రి రోజున ఉరివేసుకుని చనిపోయాడు. దీనికి కారణం స్వాతి అని మోహన్ తప్పుడు ప్రచారం చేసి, ఆమెను మానసికంగా వేధించాడని, అందువల్ల ప్రాణాలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. స్వాతి తల్లి భద్రావతి న్యూటౌన్ ఠాణాలో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ నిఖిల్ ఆదేశాలతో నిందితునిపై కేసు నమోదు చేశారు. కేసులో నిజాన్ని బయటకు తీసుకురావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also read
- వివేకా హత్య కేసు – ఈడీ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
- మద్యం రవాణా కుంభకోణం అప్డేట్స్ – కారుమూరి సునీల్ను విచారిస్తున్న సిట్
- అంకిత భండారి హత్య కేసు – ఆమె కుటుంబం CBI విచారణ కోరుతోంది
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Vijayawada Drugs:బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!



