SGSTV NEWS online
CrimeTechnology

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..నిర్వహకుల తీరుతో పసిప్రాణం బలి


నాగర్ కర్నూల్‌ జిల్లా  అదే మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దీంతో కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడి లో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..



కాగా కుమ్మెర గ్రామంలో ప్రతి ఏడాది జరిగే మల్లన్న జాతర లో భాగంగా  సమీప గ్రామలు, ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చాకలి చంద్రకళ అనే మహిళా కుటుంబం కూడా జాతరకు వెళ్లింది. అయితే దర్శనం కోసం క్యూలో నిల్చున్న భక్తుల వద్ద.. నిర్వాహకులు ప్రత్యేదర్శనం పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కాగా ఈ విషయమై చాకలి చంద్రకళ కుటుంబం ఇది సంప్రదాయంలో లేదని, అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో ఆ కుటుంబానికి. నిర్వహకులకు మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో చాకలి చంద్రకళ కుటుంబాన్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు.

అంతేకాక వారిని తక్కువ జాతి వారని  కుమ్మెర మల్లన్న జాతర నిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదని వారు ఆరోపించారు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళ కుటుంబాన్ని బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు.  చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్‌ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారని ఆరోపించారు. రెండు నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబసభ్యులు వేడుకున్నా వారు వినిపించుకోకుండా ఆ చిన్నారిని కాలుతో తన్నారని చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది.

ఈ విషయమై చంద్రకళ కుటుంబసభ్యులు నిర్వాహకులపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. నాగర్ కర్నూల్ పీఎస్‌లో పోలీసుల తిరిగి బాధితులనే బెదిరించారని వారు వాపోయారు. నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర కుల వ్యక్తులు కావడం వల్లే పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జాతర నిర్వాహకులు సర్పంచ్ సహా తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి తదితరులు తమ కుటుంబాన్నిఅడ్డుకొని దాడి చేశారని వార ఆరోపించారు.



కాగా, ఈ ఘటనపై స్థానికుల నుంచి పోలీసులపై వ్యతిరేకత రావడంతో పోలీసులు స్పందించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న సాక్షుల వాంగ్మూలాలు సేకరించినట్లు తెలిసింది. అలాగే జాతర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.   చిన్నారి మృతితో కుమ్మెర గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also read

Related posts