యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఫార్మా కంపెనీల్లో వరస పేలుళ్లు భయాందోళనలకు గురి చేస్తోంది. ఇటీవల ఎల్లగిరి గ్రామ పరిధిలోని బృందావన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పేలుడు ఘటన మరువక ముందే, మరో దారుణం చోటు చేసుకుంది. సరిగ్గా వారం రోజులక్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా బృందావన్ కంపెనీలో ఓ రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. తాజాగా ఎల్లగిరి గ్రామానికి పొరుగున ఉన్న భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
సాయి కెమికల్ ల్యాబ్‌లో మరో పేలుడు జరిగింది. డ్రమ్ములో కెమికల్ నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కెమికల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఎగిసిపడుతున్న మంటలు, కెమికల్ డ్రమ్ములు ఉండడంతో పరిసరాల్లో భారీగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పేలుడు ధాటికి కంపెనీ నుండి కెమికల్ ద్రావకం బయటకు ప్రవహిస్తోంది. భోజన విరామం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఒక వ్యక్తి కాలి బూడిదయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా పుటేజీ ప్రమాద తీవ్రత ఎంత భయానకంగా ఉందో తెలియజేస్తుంది. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
V.J సాయి ఫార్మా కెమికల్ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో కెమిస్ట్ ధార పవన్ (35) ప్రాణాలు కోల్పోయాడు. మంటల తీవ్రతకు మృతదేహం పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులతో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఘటనను గోప్యంగా దాచిన యాజమాన్యంపై మృతుడి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?
- దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, ముఖ్యమైన నియమాలు ఇవే!
- నవదుర్గలలో ఈరోజు 5వ రోజు – స్కందమాత, ఐదవ నవదుర్గ…!!*_
- దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!
- దుర్గాదేవి చేతిలోని 8 ఆయుధాలు మనకు చెప్పే 8 జీవిత పాఠాలు ఏమిటో తెలుసా!





