వారంతా అరుణాచలం యాత్రకు వెళ్లారు. అక్కడ అరుణాచలేశ్వర ఆలయంలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం కారులో ఇంటికి వస్తున్నారు. అర్థరాత్రి అయ్యింది.. మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన మంగళవారం అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాయికల్ టోల్ ప్లాజా దగ్గర గుర్తు తెలియని వాహనం ఒక ఇన్నోవా క్రిష్ట వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.
అరుణాచలం నుంచి యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి.. వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారు మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు..
మృతులిద్దరూ రంగారెడ్డి జిల్లా తుర్క యాంజాల్‌కు చెందిన పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని.. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరికొన్ని నిమిషాల్లో ఇంటికి వస్తారనగా.. ఊహించని ఘటన జరగడం.. ఇద్దరు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also read
- గొల్కొండలో తారామతి బారాదరి రిసార్ట్.. పార్టీలో డ్రగ్స్ కలకలం, వెలుగులోకి కొత్త విషయాలు
- 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
- హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!
- Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?





