హైదరాబాద్‌లో శివరాత్రి సందర్భంగా సంచలన ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి పేరుతో శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టారు ఇద్దరు యువకులు. గుర్తించిన చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి.. వారు గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో శివరాత్రి సందర్భంగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. శివరాత్రి సందర్భంగా ఇద్దరు యువకులు శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. శివుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టిన ఫలక్‌నుమా జంగమ్మెట్కు చెందిన సభావత్ శ్రీ చరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి చర్యల నిమిత్తం వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ మిమ్మల్ని కాపాడవు.. అవి కేవలం క్షణికానందం మాత్రమే అని పేర్కొన్నారు. కానీ చట్టం వేసే శిక్ష మాత్రం జీవితకాలం వెంటాడుతుందని సీపీ హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియా మత్తులో పడి మీ బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోకండి అంటూ మరో ట్వీట్లో స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం కొందరు యువకులు ప్రమాదకరమైన పనులకు పాల్పడుతున్నారని పోలీసులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తున్నారు. శివరాత్రి లాంటి పవిత్రమైన రోజున ఇలా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం చివరికి కేసుగా మారిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
శివుడికి ప్రసాదంగా గంజాయి.. వీడియో వైరల్.. రీల్స్ బ్యాచ్‌పై పోలీసుల సీరియస్ యాక్షన్!
Also read
- రెండేళ్ల పసికందుపై.. కసాయి తండ్రి దారుణం
- ఆ ఊర్లో అర్ధరాత్రి ఇళ్లపై రాళ్ల వర్షం.. భయంతో వణికిపోతున్న జనాలు! అంతుచిక్కని మిస్టరీ..
- బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
- ఒంటరి మహిళలే టార్గెట్! వృద్ధురాలి మెడలోంచి 5 తులాల బంగారం చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
- బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నిండా ముంచేశారు!





