ఇద్దరూ లవర్స్.. హైదరాబాద్‌లో ఉంటున్నారు.. అయితే.. మచిలీపట్నం వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్‌లో స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. ఇద్దరివీ పక్కపక్కనే సీట్లు.. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే.. పక్క పక్కనే సీట్లు కానీ.. అమ్మాయి.. అబ్బాయి పేర్లు ఉండాలి.. కానీ.. బుకింగ్ లో పేర్లు మాత్రం ఇద్దరూ అమ్మాయిలవే ఉన్నాయి.. దీంతో డ్రైవర్ ఇదేంటంటూ ప్రశ్నించాడు.. ఇద్దరూ పక్కపక్కనే నిద్రించేందుకు ఒప్పుకోలేదు.. దీంతో లవర్స్ ఏకంగా డ్రైవర్ తో గొడవపడ్డారు.. చివరకు డ్రైవర్ ను కొట్టేవరకు వరకు వెళ్లారు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కలకలం రేపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ ప్రేమజంట వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రయాణంలో చోటు చేసుకున్న చిన్నపాటి వాగ్వాదం.. చివరకు దాడికి దారి తీసింది. ఈ సంఘటనలో డ్రైవర్ గాయపడగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇద్దరు లవర్స్ మచిలీపట్నం రావడానికి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ముందస్తుగా రెండు సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆ రెండు సీట్లను యువతల పేరుతోనే రిజర్వ్ చేసినట్టు సమాచారం.. ప్రయాణం ప్రారంభమైన తర్వాత సీటింగ్ విషయంలో బస్సులో వివాదం తలెత్తింది. యువతల పేరుపై బుక్ చేసిన సీట్లులో యువకుడిని కూర్చునేందుకు డ్రైవర్ అనుమతించలేదు. కంపెనీ నిబంధనలు, ఐడి వివరాల కారణంగా తాను అనుమతించలేనని డ్రైవర్ చెప్పడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బస్సులోని ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
అయితే, ప్రయాణం ముగింపు దశలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. లవర్ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో దిగి ఇద్దరినీ పక్కపక్కన కూర్చొనివ్వలేదని.. డ్రైవర్ ను వదలొద్దని ప్రియుడికి చెప్పింది. దీంతో యువకుడు రెచ్చిపోయి చిలకలపూడి సెంటర్లో డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





