రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది.. రోజుకో ఎపిసోడ్ బయటికి వస్తుంది నిన్నటి వరకు తనను లైంగికంగా వేధించాడు అని ఆరోపించిన హర్ష వీణ.. ఈరోజు అరవ శ్రీధర్ వ్యవహారంలో ఒక అడుగు ముందుకేసింది. మరో ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉంది అని చెబుతూ వారితో చేసిన చాటింగ్ లను బయటపెట్టింది.
మరో ఇద్దరమ్మాయిలతో ఆ యవ్వారం.. 1000 వీడియోలున్నాయ్.. MLA శ్రీధర్‌పై మరో బాంబ్ పేల్చిన వీణ
జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్పై మరోసారి బాధితురాలు వీణ చాటింగ్ బాంబ్ వేశారు. ఇప్పటికే రిలీజైన వీడియోలతో రగిలిన మంటలు చల్లారకముందే.. బాధితురాలు వీణ మరో చాటింగ్ బాంబ్ పేల్చింది. పుల్లంపేట MDO చూశావు అన్నావు.. మళ్లీ వేరే అమ్మాయిల లెగ్గిన్స్ గురించి అసభ్య సంభాషణల చేస్తున్నావంటూ వీణ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చాటింగ్‌లో ఉంది. ఇలాగే మాట్లాడితే తన దగ్గర వెయ్యికి పైగా వీడియో స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయంటూ అరవ శ్రీధర్‌కు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు వేరే అమ్మాయిలతోనూ అరవ శ్రీధర్ చాటింగ్ చేసిన స్క్రీన్షాట్లను రిలీజ్ చేసింది వీణ
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాదాపు 11 రోజులుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే బాధితురాలు హర్ష వీణ ఇద్దరూ వారి దగ్గర ఉన్న ఆధారాలను బయటపెడుతూ వస్తున్నారు.. అరవ శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తన వద్ద కూడా అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని జనసేన పార్టీకి సమర్పించాలని నిజ నిజాలు కమిటీని తేలుస్తుందని చెప్పారు. అయితే వీణ, ఆరవ శ్రీధర్ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి తనతోనే కాకుండా మరో ఇద్దరితో అరవ శ్రీధర్ లైంగిక సంబంధమైన వ్యవహారాలు నడిపినట్లు చాటింగ్ రికార్డులను బయటపెట్టింది..
అంతే కాకుండా తనతో చాటింగ్ చేసిన మరో చాటింగ్ కూడా వీణ బయటపెట్టింది. అందులో అరవా శ్రీధర్ కు సంబంధించిన 1000 స్క్రీన్ రికార్డింగ్ వీడియోలు తనవద్ద ఉన్నట్టు కూడా ఆమె అరవ శ్రీధర్ కు చెప్పింది. తనతో మాట్లాడుతూ వేరే మహిళల గురించి మాట్లాడటాన్న తప్పు పట్టిన వీణ.. తన దగ్గర ఉన్న విషయాలను ఎప్పుడో ఒకప్పుడు ఒళ్ళు మండి బయటపెడతానని.. ఆ చాటింగ్‌లో అరవ శ్రీధర్ తో చాట్ చేసింది.. రోజురోజుకీ ఓ కొత్త మలుపు తిరుగుతున్న ఎమ్మెల్యే ఇష్యూ రానున్న కాలంలో మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Also read
- ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు.. సీన్ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!
- Rare Raj Yogas: మహా శివరాత్రి నాడు 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశకు మించిన లాభాలు..!
- Maha Shivaratri: మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు అస్సలు చేయొద్దు
- Namakkal Hanuman Temple: రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా.?
- నేటి జాతకములు…9 ఫిబ్రవరి, 2026





