చిత్తూరు : వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్త,
అత్తను చంపేయాలని మహిళ చెప్పడంతో వృద్ధురాలిని హత్య చేయబోయాడు ఓ బాలుడు. చిత్తూరు వన్టేన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు నగరం, గిరింపేటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా నివాసం ఉంటున్న 37 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్లయి, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
బాలుడితో ఉన్న బంధం కారణంగా తరచూ ఇంట్లో గొడవలు అయ్యేవి. ఈ నేపథ్యంలో తమకు అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపేయాలని ఆ మహిళ, బాలుడికి అతను చెప్పడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు.
వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రేరేపించిన మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు.
Also read
- అతడొక డెలివరీ బాయ్.. తెల్లారి పార్శిళ్లు.. రాత్రుళ్లు ఆ యవ్వారం.!
- పిఠాపురం పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. వర్మకు టీడీపీ ఊహించని షాక్.. అసలు కారణం ఇదే..
- సిగరెట్ అప్పుగా ఇవ్వలేదని ఎంతకు తెగించాడంటే..
- రెండు రోజుల్లో కుమార్తె వివాహం…
- అత్యాశకు పోయి.. అధిక వడ్డీ వలకు చిక్కి..





