హైదరాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీ హెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్లో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. గురువారం తాను పనిచేసే సీబీసీఐడీ కాలనీలోని ప్రైవేట్ కంపెనీ కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను నిజాంపేటలోని శ్రీశ్రీ హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆరోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆమె తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





