అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం రేపాయి. సుమారు 13 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువలను పశువులను మేపేందుకు వెళ్లిన గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు.
సాధారణంగా కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది దగ్గరకు వస్తే.. ఇంకేమైనా ఉందా.! దెబ్బకు హడలిపోతారు. ఊరు చివరిన ఉన్న మామిడి తోటలో ఏకంగా రెండు కొండచిలువలు వచ్చాయి. వాటిని చూడగానే అక్కడ పని చేసే సిబ్బంది దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం రేపాయి. సుమారు 13 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువలను పశువులను మేపేందుకు వెళ్లిన గ్రామస్థులు గుర్తించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్ శోభనాద్రి నేతృత్వంలోని రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి చాకచక్యంగా రెండు కొండచిలువలను పట్టుకుంది. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
Also read
- Kidney Patients: కిడ్నీ రోగులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమవుతుంది..
- గోత్రం తెలియక పోతే పేరుతో అర్చన చేయించుకోవచ్చా……
- Moon Double Transit: శని జయంతి నాడు చంద్రుడి డబుల్ ధమాకా.. ఈ 3 రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు.. ఇక అంతా శుభమే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- వస్తావా.? అని అడిగారు.. తీరా వెళ్లాక అసలు సినిమా చూపించింది.!




