అమావాస్యకు నీటి రంగుకు సంబంధం ఉందా? నీరు ఏ కలర్లో ఉంటుంది? ఎక్కడైనా వాటర్ నల్ల రంగులో ఉంటుందా? మామూలు రంగులో ఉన్న నీరు అమావాస్య నుండి నలుపు రంగులోకి ఎందుకు మారింది? ఇవన్నీ.. అక్కడి ప్రాంత ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు.. అసలు నీరు రంగు అకస్మాత్తుగా ఎందుకు మారింది అనేది అంతుచిక్కనిదిగా మారింది.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో నీటి కుంటలో నీరు నల్లగా మారడం కలకలం రేపుతుంది. గ్రామంలో పూర్వికుల కాలం నాటి నుంచి ఉన్న అయ్యప్ప నీటి కుంటలో నీరు ఒక్కసారిగా నల్ల రంగులో మారడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గత అమావాస్య నాడు నుండి నీటి కుంటలో ఉన్న నీరు ఒక్కసారిగా నలుపు రంగులో మారాయని పేర్కొంటున్నారు. అయితే.. అందులో ఎవరైనా అమావాస్య నాడు చేతబడి చేశారా, లేక నీటిలో పాయిజన్ కలిపారా, ఏమైనా కలుషితం అయ్యాయా..? అంటూ గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ కుంటలో నీరు నలుపు రంగులో మారడంతో భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే.. కుంటలోని నీరు నలుపు రంగులోకి మారడంతో.. రోజు తాగే మూగజీవులు కూడా నీరు తాగకుండా అల్లాడిపోతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నీటి నుంచి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోక ముందే.. ఆ నీటిని పరిశోధనకు పంపి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అయితే.. అమావాస్య నాటి నుంచి నీరు నల్లగా మారడం స్థానికంగా కలకలం రేపింది.
Also Read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





