SGSTV NEWS online
CrimeTelangana

పెళ్లైన మూడు రోజులకే నవవధువు ఆత్మహత్య.. కారణం అదేనా!

నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఓ యువకుడి వేధింపులు భరించలేక శ్రీలత బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీలతకు రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన మల్లేశంతో అక్టోబర్ 26వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యిన శ్రీలత భర్తతో కలిసి దోమ మండలం మోత్తూరులో ఉంటున్న మేనమామ ఇంటికెళ్లింది. అక్కడే బాత్రూంలో ఆమె పురుగు మందు తాగడంతో.. కుటుంబ సభ్యులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీలత మృతి చెందింది.

ఆమె మృతికి చంద్రవంచ గ్రామానికి చెందిన సురేష్‌ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ న్యాయం చేయాలని, నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. తాండూర్- మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నాకు దిగారు. కాగా కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts