ఇంతకంటే దారుణం ఉంటుందా..? బావకి పిల్లలు అందడం లేదు.. అతనికి కూడా వారసుడ్ని అందించు అంటూ.. చిన్న కోడలికి వేధిస్తున్నారు అత్తమామలు. ఇంత జరుగుతున్నా ఆమె భర్త మూగి మొద్దులా ఉంటూ ఏమీ పట్టించుకోవడం లేదు. దీంతో తనను కాపాడాలంటూ పుట్టింటివారికి కబురు పెట్టింది ఆ యువతి…
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం వెలుగుచూసింది. భర్తతోనే కాదు బావతోనూ కాపురం చెయ్యాలంటూ చిన్నకోడలిని వేధిస్తున్నారు అత్తమామలు. బావకి పిల్లలు లేరు కాబట్టి అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని వేధించారు. అంగీకరించకపోవటంతో గదిలో బంధించారు.
పోలవరానికి చెందిన యువతికి జంగారెడ్డిగూడెంకి చెందిన రంజిత్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సున్న బాబు ఉన్నాడు. అయితే బాధితురాలి భర్తకు అన్న అయిన ప్రవీణ్‌కు వివాహం జరిగి ఎనిమిది ఏళ్లు అవుతున్నా పిల్లలు లేరు. దీంతో బావ ప్రవీణ్‌కు పిల్లలను కనివ్వాలంటూ అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. అంగీకరించకపోవడంతో నిర్భంధించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను ఆదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తన చెల్లిని తీవ్రంగా వేధిస్తున్నారని బాధితురాలి అన్న ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. బాధితురాలని వేధిస్తున్న నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, మహిళా సంఘం నాయకులు. ఈ ఇష్యూపై ఫిర్యాదు అందిందని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే బాధితురాలి ఆరోపణలను అత్తమామలు ఖండిస్తున్నారు. తాము వేధించలేదని చెబుతున్నారు. తమది అలాంటి కుటుంబం కాదని.. తమపై కట్టు కథలు అల్లుతున్నారని.. విచారణలో నిజాలు తెలుస్తాయంటున్నారు
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





