వివాహం కుదిరింది.. పెళ్లి దగ్గర పడింది.. పెళ్లి పనుల్లో కుటుంబసభ్యులంతా బిజీగా ఉన్నారు.. ఇంతలోనే వరుడి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయోజకుడు అయినా కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తండ్రి, వివాహం కుదుర్చాడు. మరో రెండు వారాల్లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో కుమారుడికి తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో చికిత్స కొరకు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లితండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఐరన్ బండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ లింగన్న, గోపాలమ్మలది నిరుపేద కుటుంబం. కూలి పనులే జీవనాధారం. వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కుమారుడికి వివాహమైంది. రెండో కుమారుడు వలస వెళ్లి రైలు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. చిన్న కుమారుడు బోయ నీలకంఠ(30) గ్రామంలో ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. దీనికితోడు తండ్రి ఆరోగ్యం సరిగా లేదు. కుమారుడు స్థిరపడటంతో ఇటీవల నిశ్చితార్థం జరిపించారు.
రెండు వారాల్లో పెళ్లి చేయాలని పెద్దలు ఖరారు చేశారు. 15 రోజుల నుంచి విపరీతమైన జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ప్లేట్ లెవెల్స్ తగ్గాయని మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (ఫిబ్రవరి 20) మృతి చెందాడు. చెట్టంత కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన గ్రామస్థులను కన్నీరు పెట్టించాయి.
Also read
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్‌స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే





