సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బంది
కాకినాడ : భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహితను పోలీసులు క్షణాల్లో కాపాడారు. స్థానిక జగన్నాధపురం సమీపంలోని ఎన్.టి.ఆర్. బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 ఏళ్ల వయస్సు గల మహిళ సోమవారం బ్రిడ్జిపై నుండి ఉప్పుటేరులోకి దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బాబురావు, పోలీస్ కానిస్టేబుల్ అప్పన్న సమయస్ఫూర్తితో స్పందించి ఆమెను పట్టుకొని కింద పడకుండా ఆపారు. వెంటనే ఆమెను సురక్షితంగా పైకి లాగి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆమెను విచారించగా తన భర్త నుండి తరచూ వేధింపులకు గురవుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మానసికంగా విసిగి ఆత్మహత్య యత్నించినట్లు తెలిపింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రాఫిక్ సిబ్బంది చూపిన చాకచక్యానికి ప్రజలు, ప్రశంసలు కురిపిస్తున్నారు
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





