SGSTV NEWS online
Andhra PradeshCrime

Andhra: తెల్లారేసరికి బ్యాంక్ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది.. గోడకు కనిపించింది చూడగా




దర్జాగా బ్యాంక్ దోచేయాలని అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ బ్యాంక్ దోచేందుకు పక్కనే ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో కన్నం వేశారు. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. లేట్ ఎందుకు


తిరుపతి జిల్లాలో దుండగులు బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు. నాగలాపురం యూనియన్ బ్యాంక్‌కు కన్నం పెట్టారు. ఏకంగా బ్యాంకు మొత్తాన్ని దోచేయాలని భావించి చోరీకి ప్రయత్నించారు. ఈ మేరకు పక్కా ప్లాన్ వేశారు. యూనియన్ బ్యాంకుకు వెనుక వైపు ఉన్న సిమెంట్ గోడౌన్‌ను ఎంచుకున్నారు. సిమెంట్ గోడౌన్ షట్టర్‌ను కట్ చేసి లోపలికి వెళ్లారు. గోడౌన్‌కు, బ్యాంకుకు మధ్య ఉన్న గోడకు కన్నం పెట్టారు. సిమెంట్ గోడౌన్‌లో కరెంటు లేకపోవడంతో బ్యాటరీ కట్టర్‌ను ఉపయోగించి కన్నం పెట్టిన దుండగులు మనిషి వెళ్లేంత రంధ్రం గోడకు పెట్టి దొంగలు ఇద్దరు లోపలికి వెళ్లారు. ముందుగా బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలు, అలారం సెట్‌ను తొలగించిన దుండగులు బ్యాంకు లోపల లాకర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. రాత్రంతా శ్రమించిన దొంగలు తెల్లారే వరకు ప్రయత్నం చేసినా సఫలం కాకపోవడంతో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి దుండగులకు ఏర్పడింది.



దీంతో బ్యాంకు నుంచి వెళ్లేటప్పుడు సీసీటీవీ, డివిఆర్ బాక్స్‌లు, హార్డ్ డిస్క్‌లను దొంగలు తీసుకెళ్లారు. దీంతో ఉదయం యధావిధిగా సిబ్బంది బ్యాంక్‌కు చేరుకోగానే దొంగతనం ప్రయత్నం జరిగినట్లు భావించారు. బ్యాంకును మొత్తం పరిశీలించారు. బ్యాంకు వెనుకవైపు గోడకు కన్నం పెట్టినట్లు గుర్తించారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ కాలేదని గుర్తించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత దొంగతనం కోసం జరిగిన ప్రయత్నంపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీసులు. అందుబాటులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఇద్దరు నిందితుల చిత్రాలను విడుదల చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Also read

Related posts