శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా లింగాపురం గిరిజనగూడకు చెందిన సునీత అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నరకయాతన పడ్డారు. రోడ్డు మార్గం లేకపోవడంతో ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల మేర డోలీలో మోసుకుంటూ వెళ్లి, అక్కడి నుంచి ఆటోలో పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.
గర్భిణులు, బాలింతలు, వృద్ధులు అస్వస్థతకు గురైనప్పుడు ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే వారికి డోలీనే ఏకైక దిక్కవుతోంది. రహదారి నిర్మిస్తామని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





