అజిత్ సింగ్ నగర్ (విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సంగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





