హైదరాబాద్ మహానగరం జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి ఆర్డిజన్ ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు ఆర్టిజన్ రాంబాబు (35) ప్రమాదవశాత్తు మృతి చెందారు. నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కి మరమత్తులు చేస్తుండగా విద్యత్ షాక్‌కు గురై ఆర్డిజన్ రాంబాబు దుర్మరణం పాలయ్యారు.

షాపూర్ నగర్ నివాసముంటున్న రాంబాబు (35) ఆర్టిజన్‌గా షాపూర్ నగర్ సబ్ స్టేషన్-2 లో విధులు నిర్వహిస్తున్నాడు. అదివారం (సెప్టెంబర్ 2 ) ఎఈ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు షాక్ తో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు రాంబాబును హుటాహుటీన దగ్గరలోని ప్రయివేట్ హాస్పటల్ కు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు కుటుంబసభ్యులు హాస్పటల్‌కు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మృతుడు రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి కార్మికులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కార్మికుడిని పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించారంటూ విద్యుత్ అధికారులను నిలదీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..