రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyd crime: అది 2019 నవంబర్.. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ దగ్గర 26 ఏళ్ల యువతిని సామూహిక అత్యాచారం దారుణంగా హత్య చేశారు! అత్యాచారం చేసిన తరువాత యువతి మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లి ఒక బ్రిడ్జి కింద పడేసి తగలబెట్టారు. ఆ సమయంలో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది! అయితే సరిగ్గా ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని కిస్మత్‌పురా బ్రిడ్జి కింద నగ్నంగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం లభ్యమవడం కలకలం రేపుతోంది. యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 25 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసున్న యువతిగా గుర్తించారు.మూడు రోజుల క్రితమే హత్య చేసి పడేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూ టీమ్ సహాయం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు