SGSTV NEWS
Crime

Kidnapping Case: తిరుపతిలో రౌడీషీటర్ హల్చల్..తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసి..

తిరుపతి నగరంలోని లక్షిపురం సర్కిల్ వద్ద రౌడీషీటర్ అజీజ్, అతని అనుచరుడు బబ్లు నానా హంగామా సృష్టించారు.  తల్లి , కూతురును కారులో కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. మాట వినకపోతే చంపేస్తా అంటూ కత్తులతో బెదిరించాడు. వారిని వెంబడించిన పోలీసులు పట్టుకున్నారు.

Kidnapping Case: విలన్లు మహిళలను కిడ్నాప్‌ చేయడం. కిడ్నాప్‌ చేసిన విలన్లను పోలీసులు వెంటాడటం, కారును చేజ్‌ చేయడం కోసం పోలీస్‌ వాహనం వారి వెంటపడటం.. ఇదంతా సినిమాల్లోనే మనం చూస్తుంటాం. కానీ, కొన్నిసార్లు సినిమా సీన్లకు ఏ మాత్రం తగ్గని ఘటనలు  నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి. అలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది.ఓ రౌడీషీటర్ తల్లీకూతురును కారులో కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ.. ఆ వాహనాన్ని వెంబడించాడు. 

తిరుపతి నగరంలోని లక్షిపురం సర్కిల్ వద్ద రౌడీషీటర్ అజీజ్, అతని అనుచరుడు బబ్లు నానా హంగామా సృష్టించారు.  తల్లి , కూతురును కారులో కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. మాట వినకపోతే చంపేస్తా అంటూ కత్తులతో బెదిరించాడు. వారిని కారులో తీసుకెళ్తుండగా.. సదరు మహిళ తన భర్తకు లోకేషన్ షేర్ చేసింది. లోకేషన్ చూసిన భర్త.. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్పాట్‌ ను గుర్తించారు. రాత్రి విధుల్లో ఉన్న అలిపిరి సీఐ రామకిషోర్ బృందం.. రౌడీ షీటర్ కారును చేజ్ చేశారు. కొర్లగుంట  సమీపంలో కారును గుర్తించిన పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రౌడీ షీటర్ వెంటనే కారును ముందుకు దూకించాడు. రెండు కార్లు, ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ భయబ్రాంతులకు గురి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు.

అయినా పోలీసులు వెనుకాడలేదు. చివరకు సీఐ రాంకిషోర్ బృందం.. సినీ తరహాలో కారును వెంబడించి వారిని పట్టుకున్నారు. తల్లీకూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చి, రౌడీషీటర్ అజీజ్, అతడి అనుచరుడు బబ్లును అదుపులోకి తీసుకొన్నారు.  అనంతరం వారిని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు రౌడీ షీటర్ గతంలో కూడా పలు కేసుల్లో అరెస్టయి జైలు జీవితం గడిపినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వారిని డబ్బుల కోసం కిడ్నాప్‌ చేశాడా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఫిర్యాదు రాగానే స్పందించిన పోలీసులు కిడ్నాపర్లను పట్టుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

Also read

Related posts

Share this