కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తోపాటు..ముగ్గురు జైలు వార్డర్లను సస్పెండ్ చేశారు.
Central Jail Kadapa : కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఐదుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తోపాటు.. మరో ముగ్గురు జైలు వార్డర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు.
కడప జైల్లో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై నాలుగు రోజులపాటు కడప జైల్లో డిఐజీ రవికిరణ్ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో విచారణలో భాగంగా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





