ఏలూరు జిల్లా దెందులూరు భీమడోలు హైవేపై శుక్రవారం అర్థరాత్రి బస్సుబోల్తాపడింది.అర్థరాత్రి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇంటర్ సిటీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దెందులూరు వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 16 మంది స్వల్పంగా గాయపడ్డారు.
Bus accident : ఏలూరు జిల్లా దెందులూరు భీమడోలు హైవేపై శుక్రవారం అర్థరాత్రి బస్సుబోల్తాపడింది. రాత్రి రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇంటర్ సిటీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దెందులూరు వద్ద బోల్తాపడింది. బస్సు దెందులూరు వచ్చే సమయానికి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో భీమడోలు నాగహనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద లోడ్‌తో ఉన్న ఓ లారీ బోల్తా పడింది. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి వేగంగా వస్తున్న ఇంటర్ సిటీ బస్సు డ్రైవర్ చిన్నగా వర్షం కురుస్తుండటంతో బోల్తాపడిన లారీని చివరినిమిషంలో గమనించాడు. దీంతో డ్రైవర్ సూరిబాబు ఒక్కసారిగా బస్సును కుడివైపుకు తిప్పాడు.
బస్సు వేగంలో ఉండటం, ఒక్కసారిగా కుడివైపుకు తిప్పడంతో డివైడర్‌ను ఢీకొన్న బస్సు అవతలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు ఒక పక్కకు పడిపోయింది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణీకులు స్వల్పంగా గాయపడగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడిన వారిని మూడు అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
పెట్రోలింగ్, పోలీసు సిబ్బంది చాలాసేపు శ్రమించి జేసీబీ సాయంతో బస్సును పక్కకు తీశారు. కాగా బస్సు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




