తన తల్లి పుట్టినరోజే ఆ యువకుడికి చివరిరోజు అయ్యింది. తల్లి బర్త్ డేను స్నేహితులతో కలిసి చేసుకుందామని వెళ్లిన యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. యువకుడి వద్ద ఉన్నడబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిరాకరించడమే ఆ యువకుడికి శాపమైంది.
TG Crime : తన తల్లి పుట్టినరోజే ఆ యువకుడికి చివరిరోజు అయ్యింది. తల్లి బర్త్ డేను స్నేహితులతో కలిసి చేసుకుందామని వెళ్లిన యువకున్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. యువకుడి వద్ద ఉన్న బంగారం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిరాకరించడమే ఆ యువకుడికి శాపమైంది
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి తల్లిబర్త్ డే పార్టీ చేసుకుంటున్న యువకుడిపై దుండుగులు దాడి చేసి కత్తులతో పొడిచి చంపారు. తల్లి పుట్టినరోజు సందర్భంగా జయంత్ గౌడ్ అనే యువకుడు మాదాపూర్ యశోద ఆస్పత్రి వెనుక స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. స్నేహితులతో కలిసి జయంత్ పార్టీ చేసుకుంటూ ఉండగా ముగ్గురు గుర్తు తెలియన వ్యక్తులు వచ్చి జయంత్ వద్ద ఉన్న బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. అయితే దానికి నిరాకరించిన జయంత్ వారితో గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన ఆ అగంతకులు జయంతపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి పుట్టిన రోజునే కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసిన దుండగుల కోసం గాలింపు చేపట్టారు
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





