లేడీ అఘోరిపై మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ లైంగి దాడికి పాల్పడ్డట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరిని విచారించనున్నారు
BIG BREAKING: లేడీ అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్‌పై మరో రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ కొత్తపెళ్లికి చెందిన యువతి.. బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్‌ను తాకుతూ లైంగి దాడికి పాల్పడ్డట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అఘోరిని విచారించనున్నారు.
కొండగట్టులో తాళి కట్టి..
ఈ మేరకు ఇప్పటికే వర్షిణీతోపాటు పలు కేసుల్లో రిమాండ్‌లో ఉన్న అఘోరికి కరీంనగర్ కొత్తపల్లి యువతి బిగ్ షాక్ ఇచ్చింది. సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న శ్రీనివాస్.. తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరించి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని, బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు అఘోరీపై 64(1), 87 318(4) 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళా ప్రొడ్యూసర్ నుంచి 10 లక్షలు
గతంలోనూ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ . క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది. దీంతో అఘోరీ తో పాటు అతన్ని పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణిని కూడా తీసుకొచ్చారు. పూజల పేరుతో ఓ మహిళ నుంచి 10 లక్షలు కాజేసి.. మోసం చేసిన కేసులో అఘోరిని అరెస్ట్ చేశారు.
Also Read
- చెంబులో ‘కీ’… అదే కలిసొచ్చింది దొంగలకి
- ఫేస్ బుక్ లో వల.. సహజీవనం తర్వాత అసలు రంగు!
- భర్త కువైట్‌లో.. భార్య కడపలో.. డ్రైవర్‌తో అలా కనిపించే సరికి..
- విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- భార్యభర్త మధ్యలో ప్రియుడు.. ఆయన లేడని ఇంటికి పిలిచింది.. తర్వాతి సీన్ ఇదే..





