కాకినాడ జిల్లా పిఠాపురంలోని జగ్గయ్య చెరువు కాలనీలో మానవత్వాన్ని మరిచిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల చిన్నారిని క్షుద్ర పూజల కోసం బలిచ్చారు. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడం గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు
AP Crime: కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతంలోని జగ్గయ్య చెరువు కాలనీలో అమానుష ఘటన ఒక్కసారిగా ఊరిని హడలెత్తించింది. మానవత్వాన్ని మరిచిపోయిన విధంగా చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదు నెలల చిన్నారిని క్షుద్రపూజల కోసం బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ తల్లి తన ఐదు నెలల బిడ్డను ఇంట్లో తన పక్కనే పెట్టుకుని నిద్ర పోతుంది. అయితే అర్ధరాత్రి తల్లి మేల్కొనగా పాప పక్కన కనిపించలేదు. గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడం గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే చుట్టుపక్కల వెతుకున్న వారికి ప్రక్కింటి బావిలో చిన్నారి మృతదేహాం లభించింది.
క్షుద్రపూజల కోసమే హత్య..
ఈ సంఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. క్షుద్రపూజల కోసమే ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల సమాధానాల్లో పొంతన లేకపోవడం, వారి ప్రవర్తన మీద విచిత్ర అనుమానాలు కలుగజేస్తున్నాయని స్థానికులు చెబున్నారు. చిన్నారి మృతికి కుటుంబ సభ్యులే కారణమై ఉండొచ్చన్న కొందరు చెబుతున్నారు
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రితోపాటు తాయయ్యలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికితీయేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో భయం, వణుకు పుట్టించిన ఈ ఘటనపై అధికారులు మరింత స్పష్టత కోసం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- చేతిలో కాస్ట్లీ ఫోన్.. మెడలో టీటీడీ ఐడీ కార్డ్.. అనుమానం వచ్చి ఆరా తీస్తే గుట్టురట్టు..!
- ట్రైన్ ఇంజన్లో టార్చ్ లైట్ వేసి చెక్ చేసిన లోకో పైలట్.. మనిషి తల చూసి దెబ్బకు షాక్..
- దారుణం.. లెక్చరర్ హేళన తాళలేక రెండో ర్యాంకర్ విద్యార్థి సూసైడ్..జరిగింది తెలిస్తే..
- 6 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు.. తల్లి ఒడికి క్షేమంగా చిన్నారి!
- యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో..!





