ఏపీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట క్వారీ గంతలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే ఈ ప్రమాదం నుంచి యువతి మాత్రమే బయటపడి.. యువకుడు గల్లంతు కావడంతో ఈ ఘటన మిస్టరీగా మిగిలింది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట క్వారీ గంతలో దూకి ఆత్మహత్యకు యత్నించడం శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తు అక్కడే జీవనం సాగిస్తోంది. ఆ అమ్మాయికి దాసరిపాలెంకు చెందిన తేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తేజ దాసరి పాలెంలోని ఓ ప్రవేటు ఇంజనీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నాడు. అయితే తేజ కాలేజ్‌కు వెళ్లి వచ్చే సమయంలోనే.. ఆ అమ్మాయి కూడా స్పిన్నింగ్ మిల్లుకు వెళ్లి వస్తుండేది. దీంతో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలంగా ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇరువురి పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో కానీ.. సోమవారం రాత్రి వీరిద్దరూ కలిసి చౌడవరం సమీపంలోని క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఇద్దరిలో అమ్మాయి మాత్రమే తిరిగి వచ్చింది. యువకుడు తేజ మాత్రం ఏమయ్యాడో తెలియడం లేదు. ఈ విషయం కాస్త పోలీసులకు దృష్టికి వెల్లడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్వారీ గుంతల్లో తేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తేజ మిస్సింగ్‌పై పోలీసులు ఆ యువతిని ప్రశ్నించారు. అయితే ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన ఇద్దరం గుంతలోకి దూకామని..దానిని గమనించిన స్థానికులు తనను కాపాడారని ఆ యువతి చెబుతోంది. అయితే రాత్రి నుంచి ఎంత వెతికినా తేజ ఆచూకీ మాత్రం లభించట్లేదు. దీంతో రాత్రి అక్కడకు వీళ్లిద్దరే వెళ్లారా.. వీళ్లతో పాటు ఇంకెవరైనా వెళ్లారా అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదే కాకుండా ఇక్కడ అమ్మాయిని కాపాడిన వాళ్లు ఎవరూ అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను కాపాడిన వారు ఎవరని తెలిస్తే..తేజ ఆచూకి లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





