సిరిసిల్లలో పక్కింటి వివాహితపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Sircilla Rape Case: తెలంగాణ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పక్కింటి వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన వ్యక్తి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకెళ్తే స్థానికంగా నివసించే ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి, తన పక్కింటి వివాహిత రేఖను చెల్లి అంటూ పిలుస్తూ నమ్మకంగా మాయ చేశాడు. అయితే, శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లిన టైంని ఆసరాగా తీసుకుని, రేఖపై అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి మాయలో పడని రేఖ ప్రతిఘటించడంతో, శ్రీకాంత్ ఆమెపై కొడవలితో దాడి చేసి హత్య చేశాడు.
బలమైన గాయాలు, పంటి గాట్లు..
అయితే, రేఖ భర్త విదేశంలో ఉద్యోగం చేస్తుంటాడు, ఇంతటి దారుణ హత్య చేసి భయంతో శ్రీకాంత్ తన ఇంట్లోనే తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేఖ శరీరంపై బలమైన గాయాలు, పంటి గాట్లు ఉండటంతో ఇది ప్లాన్ ప్రకారంగానే చేసిన దాడిగా అనుమానిస్తున్నారు
ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. నిందితుడు చెల్లి అంటూ నమ్మించి ఇంత దారుణానికి పాల్పడిన తీరు ప్రజలను షాక్కు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025