పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మహిళ మూడేళ్ల చిన్నారికి ఉరివేసి.. ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో వేణుగోపాల్ రెడ్డి, లోక సాహితి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కూతురు సంతానం.. ఏమైందో ఏమో కానీ.. ఇంట్లో ఎవరు లేని సమయంలో లోక సాహితి రెడ్డి తన మూడు సంవత్సరాల కూతురు రితన్య రెడ్డికి ఉరివేసి.. తర్వాత తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డితో కరీంనగర్ జిల్లా వెధిర గ్రామానికి చెందిన సాహితీకి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు సంతానం.. మృతురాలి భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసిలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
అయితే.. బుధవారం భర్త వేణుగోపాల్ రెడ్డి జగిత్యాలలో తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా.. సాహితి రెడ్డి పెద్దపల్లిలో తాను కిరాయి కుంటున్న ఇంట్లో కూతుర్ని చంపి.. తాను కూడా ఉరివేసుకొని తనువు చాలించింది.
ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, గత కొంతకాలంగా సాహితీ మానసిక బాగాలేదని సమాచారం. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి వివరాలు బయటకు రాకపోవడంతో.. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు
Also Read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





