April 19, 2025
SGSTV NEWS
Astro Tips

Astro Tips: ఈ రాశుల వారి మొదటి పెళ్లి పెటాకులే.. రెండో పెళ్ళికి ఆసక్తి చూపించే రాశులు ఇవే..

 

కొంతమంది ఏరి కోరి కళ్ళకు నచ్చిన మనసు మెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ జీవితం అసంపూర్ణంగా ఉందని భావిస్తారు. తమ జీవిత భాగస్వామికి మానసికంగా, శారీరకంగా దూరంగా ఉంటారు. ఒకానొక సమయంలో ఈ దూరం ఇక భరించలేమనిపించినప్పుడు చివరికి విడాకులను తీసుకుంటారు. విడాకులను తీసుకున్న వ్యక్తులు ఓదార్పుని కోరుకుంటారు. రెండవసారి ప్రేమ కోసం చూస్తారు. ఈ వ్యక్తులు రెండవసారి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు మొదటి పెళ్లి పెటాకులయ్యి.. రెండో పెళ్లి చేసుకునే రాశులను గురించి తెలుసుకుందాం..


జోతిష్యశాస్త్రం వ్యక్తుల జీవితంలో మంచి చెడులు గ్రహాల సంచారం పై ఆధారపడి పడి ఉంటాయి. ప్రేమ, పెళ్లిపై కూడా గ్రహాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. జనన సమయం, తేదీ నక్షత్రం వంటి ఆధారపడి వైవాహిక జీవితం ఒక్కరికి ఒక్కలా సాగుతుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల దాంపత్య జీవితం సరిగ్గా సాగదు. కొన్ని రాశుల వ్యక్తుల వైవాహిక జీవితమలో స్థిరత్వం, శాంతి, ప్రేమ, స్వేచ్ఛ వంటివి లోపిస్తాయి. అప్పుడు మొదటి పెళ్ళికి గుడ్ బై చెప్పేసి.. రెండో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువుగా ఆసక్తిని చూపిస్తారు. కొత్త భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఈ రోజు రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న రాశులు ఏమిటో తెలుసుకుందాం..

👉  వృషభ రాశి: వీరు సంబంధాలలో స్థిరత్వం, భద్రతని కోరుకుంటారు. వీరి మొదటి వివాహం వీరి అంచనాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే తమ బంధానికి స్వస్తి చెబుతారు. తాము కోరుకునే స్థిరత్వం, భద్రతను అందించగల భాగస్వామిని వెతకడానికి ఎక్కువ అవకాశం ఉంది. వీరి దాంపత్య జీవితాన్ని సరిపెట్టుకుంటూ గడపరు.

👉   తులా రాశి: ఈ రాశివారు తమ సంబంధాలలో సామరస్యాన్ని, సమతుల్యతను విలువైనదిగా భావిస్తారు. వీరి మొదటి వివాహం వారు కోరుకునే సమతుల్యతను, సామరస్యాన్ని అందించకపోతే.. రెండవ వివాహంలో వారికి ఆ అవకాశాన్ని అందించే భాగస్వామి కోసం వెదికే అవకాశం ఉంది.


👉  వృశ్చిక రాశి: వీరు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యే వ్యత్కులు. తమ మొదటి వివాహం తన అభిరుచికి అనుగుణంగా లేదని భావించినా.. ప్రశంసలు లభించడం లేదని భావించినా వీరు రెండవ వివాహం వైపు మొగ్గు చూపుతారు. తమ అభిరుచికి సరిపోయే భాగస్వామి కోసం వీరు ఖచ్చితంగా చూస్తారు.

👉   ధనుస్సు రాశి: వీరు స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి ఎంతో విలువ ఇస్తారు. సాంప్రదాయ వివాహంలో ఊపిరాడడం లేదు అని భావిస్తారు. వీరు తమ మొదటి వివాహాన్ని నిర్బంధంగా భావిస్తే.. మరింత స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించే విధంగా మరొక భాగస్వామి కోసం వెదికే అవకాశం ఉంది.

👉  కుంభ రాశి: వీరు తమ సంబంధాలలో వ్యక్తిత్వం, ప్రత్యేకతకు విలువ ఇస్తారు. వీరి మొదటి వివాహం తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని తమ ఆసక్తిని అభిరుచిని కొనసాగించడానికి అడ్డు వస్తుందని భావిస్తే మొదటి పెళ్ళికి గుడ్ బై చెప్పేసి.. తనని విలువగా చూస్తూ తన ఆసక్తిని అర్ధం చేసుకునే వ్యక్తితో రెండవ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఏ రాశివారు మొదటి పెళ్ళికి కట్టుబడి ఉంటారంటే
మేషం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, మకరం, మీన రాశుల వారు తమ మొదటి వివాహం పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు. వీరు ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ఏ విషయంలోనైనా తమ భాగస్వామికి అండగా నిలుస్తారు. తమ వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. రెండవసారి వివాహం చేసుకోవాలనే ఆలోచన వీరి మనసులోకి ఎప్పటికీ రాకపోవచ్చు.

Related posts

Share via