కరీంనగర్లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.
సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.
ఒక్కసారిగా తాళం తిప్పడంతో..
ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు
ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు
Alao read
- Hyderabad: అంత ఈజీగా ఎలా నమ్ముతారో.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.33 లక్షలు కాజేసిన కేటుగాళ్లు!
- Hyderabad: పెళ్లి పేరుతో వంచన.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల కేసు.. !
- ఇలా తయారయ్యారేంట్రా.. బాకీ తీర్చమని అడిగితే బంగారం ఇచ్చాడు.. తీరా చూస్తే!
- Andhra News: ఎలా వస్తున్నాయ్‌రా ఇలాంటి ఐడీయాలు.. లవర్స్‌ను చంపి ఏం చేశాడో తెలిస్తే..
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి





