మానవ సంబంధాలకు నమ్మకమే పునాది. స్నేహం, పెళ్లి, ప్రేమ, ఇలా ఏ బంధమైనా సరే నమ్మకమే పునాదిగా బలంగా ఉంటాయి. మనకు నచ్చిన వ్యక్తులు చెప్పిన వారు విషయాలను మాత్రమే కాదు మన అనుకున్నవారు ఏది చెప్పినా నమ్ముతారు. తమకు సంబంధించిన అన్ని విషయాలను తము నమ్మకస్తులు అని భావించిన వారితో షేర్ చేస్తారు. అయితే కొంత మంది తమవాళ్ళు అనుకుని నమ్మితే.. వారి చేతిలోనే ఎక్కువా మోసపోతూ ఉంటారు. ఈ రోజు అలా నమ్మినవారి చేతిలో మోసపోయే రాశులు ఏమిటో తెల్సుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం మానవ జీవితం ఎలా సాగుతుందో కూడా చెప్పింది. మోసం చేసే గుణం వ్యక్తుల గురించి మాత్రమే కాదు మోసపోయే వారి గురించి కూడా వెల్లడించింది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు నమ్మిన వారి చేతిలో లేదా తాము ప్రాణ సమానంగా ప్రేమించినవారి చేతిలో మోసపోతారట. ప్రేమ నమ్మకం ఆధారంగానే ఏర్పడుతుంది. అలా నమ్మిన వారినే మోసం చేయడం చాలా సులభం. అవును మీరు నమ్మకస్తులు అని భావించే వారి చేతులోనే అతి సులభంగా మోసపోతారు. ఇటువంటి వ్యక్తులే చాలా ఈజీగా మోసం చేస్తుంటారు. కారణాలు ఏమైనా సరే మంచివారే ఎక్కువగా మోసపోతుంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు ఎప్పుడూ తాము నమ్మిన వ్యక్తుల చేతిలో మోసపోతారు. నమ్మక ద్రోహానికి బలైపోతూ ఉంటారు. ఈ రోజు అలా నమ్మక ద్రోహంతో ఇబ్బంది పాలయ్యే ఆ రాశులేమిటో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు దయ, కరుణతో ఉంటారు. ఇతరుల పట్ల సానుభూతితో ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని చాలా ఈజీగా నమ్ముతారు. అందరూ మంచివారే అని భావిస్తారు. ఇతరుల్లో మంచిని మాత్రమే చూస్తారు. మంచితనంతో .. ఆదర్శవంతంగా ఉంటారు. అయితే వీరి మంచితనాన్ని లోకువగా తీసుకుంటారు. చాలా ఈజీగా మోసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీఋ ప్రేమించినవారి చేతిలో లేదా దగ్గర ఉన్నవారి చేతిలో మోసపోతూ ఉంటారు.
తులా రాశి: రా రాశికి చెందిన వ్యక్తులు కూడా జీవితంలో సమానత్వాన్ని కోరుకుంటారు. వీరుతమతో పాటు ఉన్నవారు కూడా తమతో సమానంగాఉండాలని కోరుకుంటారు. వీరు వివాదాలకు, కలహాలకు, గొడవలకు చాలా దూరంగా ఉంటారు. జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా సాగాలని కోరుకుంటారు. ఇటువంటి ఆలోచననే వీరికి శాపం అని చెప్పవచ్చు. ఎటువంటి వారు వీరిని అవమానిస్తారు… అకారణంగా కోపగిస్తారు. వీరి ప్రశాంతంగా ఉండడం వలన చాలా సులభంగా ఇతరుల చేతిలో మోసపోతారు.
వృషభ రాశి: వీరు కూడా అత్యంత నమ్మకస్తులు. విశ్వాసం ఉన్న వ్యక్తులు. అంతేకాదు వీరు జీవితంలో ఎదురయ్యే వారి విషయంలో నమ్మకంగా ఉంటారు. చాలా ఈజీగా అందరినీ నమ్ముతారు. అందుకనే వీరిని చాలా సులభంగా మోస చేస్తారు. తమని మోసం చేసిన విషయన్ని వీరు జీర్ణించుకోలేరు. దీర్ఘకాలం బాధపడుతూనే ఉంటారు. అయినా వీరు ఈజీగా మోసపోతూనే ఉంటారు.
కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. బలమైన భావోద్వేగ బంధాలను కలిగి ఉంటారు. వీరి చేతిలోనే ఎక్కువగా కర్కాటక రాశి వారి చేతిలోనే మోసపోతారు. సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ప్రాధాన్యతనిస్తారు. దీంతో వీరు ఈ రాశివారిని నమ్మిన వ్యక్తులు సులభంగా మోసపోతారు.
ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాహసవంతులు. చాలా సులభంగా ఇతరులను నమ్ముతారు. వీరు ఆశావాదంతో ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త అనుభవాల కోరిక వీరికి ఉంటుంది. తమకు తెలియని వారిని కూడా ఎక్కువగా నమ్మే నేచర్ తో ఈ రాశి వారు చాలా సులభంగా మోసపోతారు.
