Kasturba Gandhi School : కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీచర్ వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో చోటుచేసుకుంది.
కస్తూర్బా గాంధీ పాఠశాల(Kasturba Gandhi School)లో 9వ తరగతి విద్యార్థిని స్టడీ అవర్స్ study hours కు లేటుగా వచ్చిందని ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు విద్యార్థిని మూడు గంటల పాటు నిలబెట్టింది. వాటర్ తాగనీయకుండా, బాత్రూం కూడా వెళ్ళనీయకుండా పనిష్మెంట్ ఇచ్చిందని విద్యార్థిని వాపోయింది. దీంతో మనస్థాపానికి గురై చేయి కోసుకున్నానని చెప్పింది.
తమ కూతురును ఇబ్బందులకు గురిచేసి, మనస్తాపానికి గురిచేసిన టీచర్ కళ్యాణిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు అధికారులుకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని వేధించిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. జరిగిన సంఘటనపై ఎంఈఓ విచారణ చేపట్టారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




