గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
Durgs : గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మహారాష్ట్రకు చెందిన అభిషేక్ బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకువచ్చి గత కొన్ని రోజులుగా శంషాబాద్ లో విక్రయిస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.
నిందితుడు గతంలో మహారాష్ట్ర లో కిరాణా షాపుతోపాటు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బెంగళూరుకు మాఖాం మార్చాడు. అక్కడ ఆన్ లైన్ లో డ్రగ్స్ కు సంబంధించి సెర్చింగ్ చేశాడు. దీంతో అతనికి నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. నైజీరియన్ వ్యక్తి ద్వారా ఎండిఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి అతను తీసుకునేవాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత దానిని ఇతరులకు విక్రయించేవాడు. అదే తరహాలో శంషాబాద్ లో ఎండిఎం ఏ డ్రగ్స్ ను సినిమా థియేటర్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్జీఐఏ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నిందితుని వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ ఎండి ఎంఎం డ్రగ్స్ విలువ లక్ష 80 వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. అలాగే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను క్లూస్ టీం, రెవెన్యూ బృందం పరిశీలించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుడు అభిషేక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





