March 15, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

అందమే ఆమె శాపమైంది.. రూమ్‌కు తీసుకెళ్లి లవర్ ఏం చేశాడంటే..



నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదు.. కొందరు నేరస్థులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.. తన గర్ల్‌ఫ్రెండ్ (17) అందంగా ఉందన్న గర్వంతో ఫీలవుతోందని.. తనకు నమ్మకద్రోహం చేసిందని.. భావిస్తూ ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు.


నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, దాడులు ఆగడం లేదు.. కొందరు నేరస్థులు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.. తన గర్ల్‌ఫ్రెండ్ (17) అందంగా ఉందన్న గర్వంతో ఫీలవుతోందని.. తనకు నమ్మకద్రోహం చేసిందని.. భావిస్తూ ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. తన రూమ్ కు తీసుకువచ్చి గొంతుకోసి చంపాడు. ఈ షాకింగ్ ఘటన సోమవారం కాన్పూర్ లో వెలుగుచూసింది. కాన్పూర్‌లోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రి గుంజన్ విహార్‌లో శివం వర్మ అనే యువకుడు తన ప్రియురాలు నమ్మకంగా వ్యవహరించడం లేదని.. తనకు నమ్మకద్రోహం చేసిందన్న అనుమానంతో ఆమెను తన గదికి పిలిపించుకుని.. గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత బాధిత యువతి స్నేహితులకు ఫోన్ చేసిచెప్పినట్లు పోలీసులు తెలిపారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం వేళ బాధిత యువతి ఆమె స్నేహితురాలు మార్కెట్‌కి వెళ్లిన సమయంలో శివం అక్కడికి చేరుకున్నాడు.. ఈ సమయంలో ఆమెతో మాట్లాడి.. తన గదికి రావాలని కోరాడు. దీంతో ఆ యువతి వచ్చేందుకు అంగీకరించడంతో.. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.. ఆ తర్వాత ఆమె స్నేహితురాలు ఇంటికి వెళ్లిపోయింది. రూమ్‌కు వెళ్లిన తర్వాత ఆమెను గొంతుకోసి చంపాడు.. ఈ ఘటన జరిగిన గంట తరువాత హంతకుడు బాధితురాలి స్నేహితురాలికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు.. “మీ ఫ్రెండ్ అందంగా ఉందని గర్వంగా ఫీలవుతోంది. అందుకే ఆమెను చంపేశాను.. నమ్మక ద్రోహం చేసింది.. ఈ విషయాన్ని ఆమె తండ్రికి కూడా చెప్పు” అంటూ ఫోన్ కట్ చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు..

ఈ సమాచారంతో తీవ్ర భయాందోళనకు గురైన మృతురాలి స్నేహితురాలు.. ఆమె తండ్రికి ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న మృతురాలి తండ్రి తన కుమార్తె రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉండడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.. పోలీసులు వారికి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.


మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శివం వర్మ గతంలో తమ ఇంటి పక్కనే వేరే గదిలో అద్దెకు ఉండేవాడని.. అయితే అతని ప్రవర్తన అనుచితంగా ఉండడంతో యజమాని అతడిని ఇంటి నుంచి పంపించేశాడన్నారు. శివం తరచూ యువతులను తన గదికి తీసుకువచ్చేవాడని చెప్పారు. తన కుమార్తె హత్యకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కాగా.. నిందితుడు శివంవర్మ అలియాస్ రాక్సీని మంగళవారం ఫత్తేపూర్ మోడ్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..
బాధితురాలు ఇంటర్ సెకండియర్ చదువుతోంది. నిందితుడికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విద్యార్థినితో పరిచయం ఏర్పడింది.. చెప్పాడు. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తూ ఒకరికొకరు తమ మొబైల్ నంబర్లు ఇచ్చుకుని మాట్లుకున్నారని.. ఆ తర్వాత ఇద్దరూ పలుమార్లు కలుసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే.. సోమవారం ఆ విద్యార్థి అతనికి ఫోన్ చేసినప్పుడు, అతను ఆమెను కలవడానికి వచ్చాడు. తరువాత అక్కడి నుండి ఇద్దరూ గుంజర్ విహార్‌లోని శివం గదికి చేరుకున్నారు. అయితే, ఆమె ఇక్కడికి చేరుకోగానే, ఆ విద్యార్థి తన మొబైల్ తనిఖీ చేయడం ప్రారంభించింది.. శివమ్ తన మొబైల్‌లో ఇతర అమ్మాయిలతో ఉన్న ఫోటోలు, వీడియోలను చూసిన తర్వాత ఆ విద్యార్థి అతనిపై కోప్పడింది.. దీంతో అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని.. నిందితుడు సర్జికల్ బ్లేడుతో ఆమె గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. శివంపై గతంలో కూడా పలు ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు.

Also read

Related posts

Share via