February 24, 2025
SGSTV NEWS
CrimeNational

విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులు.. విద్యార్థినిపై పైశాచికం.. గర్భిణీ అవ్వడంతో వెలుగులోకి నిజం!

 

తమిళనాడులో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గత నెల రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. ఆమె పాఠశాలకు ఎందుకు హాజరు కావడం లేదో తెలుసుకోవడానికి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికి వెళ్లాడు. దీంతో అసలు విషయం తెలిసిన ప్రిన్సిపల్ షాక్ అయ్యారు.


ఓనిర్భయ.. ఓఅభయ, ఓదిశ.. ఇలా చెప్పుకుంటూ పోతే కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు చేసిన అరాచకాలెన్నో. శిక్షలు సంగతి దేవుడెరుగు.. బాధితులు జీవితాంతం బాధితుల పడే ఆవేదన.. ఆక్రందన ఈకొడుకులకు తెలుసునా…సమాజం ఓదార్చునా.. ఇప్పుడు కూడా.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచుల్లా రెచ్చిపోయారు. విద్యా వనంలో ఓ విద్యార్థిని దారుణంగా చిదిమేసిందో తోడేళ్ల మంద. మదమెక్కి ఆదమరిచి చిన్నారిపై తమ రాక్షసవాంఛను తీర్చుకుంది. తమిళనాట వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.


కృష్ణగిరి జిల్లాలో 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించినందుకు ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అరుముగం, చిన్నస్వామి, ప్రకాష్‌లను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, సస్పెండ్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఆ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి గత నెల రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. ఆమె పాఠశాలకు ఎందుకు హాజరు కావడం లేదో తెలుసుకోవడానికి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికి వెళ్లాడు. దీంతో అసలు విషయం తెలిసిన ప్రిన్సిపల్ షాక్ అయ్యారు.

ఆ విద్యార్థిని గర్భవతి అయి గర్భస్రావం చేయించుకున్న షాకింగ్ సంఘటనను వెల్లడించింది. విద్యార్థి ప్రకటనతో షాక్ అయిన పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు ఆధారంగా మరుకూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విద్యార్థి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న చిన్నస్వామి, ఆరుముగం, ప్రకాష్‌లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ముగ్గురిపై వేటు వేశారు.


అనంతరం బాలికను కృష్ణగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినిపై లైంగిక వేధింపుల అంశం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాఠశాలను చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ఉపాధ్యాయులు అరుముగం, చిన్నస్వామి, ప్రకాష్‌లను సస్పెండ్ చేయాలని కృష్ణగిరి జిల్లా ముఖ్య విద్యాశాఖాధికారి ఆదేశించారు

Also read

Related posts

Share via