తిరుపతి జిల్లా స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కూరగాయల మార్కెట్‌లో కలికిరికి చెందిన అజమతుల్లా టమోటాల వ్యాపారం చేస్తుంటాడు. హత్యకు 1500 రూపాయల లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్నారు.
AP Crime: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు 1500 రూపాయల లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌లో కలికిరికి చెందిన అజమతుల్లా టమోటాల వ్యాపారం చేస్తుంటాడు. మరో వ్యాపారి రుద్రతో గొడవ జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవ జరిగిందని చెబుతున్నారు.
1500 కోసం హత్య:
దీంతో రుద్ర తన కుమారులు, అనుచరులతో కలిసి వచ్చి అజమతుల్లాను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యతో కూరగాయల మార్కెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయితే అన్ని వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు.
Also Read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
- యామాలోక ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఆరో పట్టణం క్రౌంచపురం – ఆత్మ ప్రయాణం అత్యంత కఠినం, వేదనాభరితమట.
- ఆ.. ఇంట్లో ఏమైందో?
- దంపతుల మధ్య గొడవ.. కొడవలితో దాడి చేసిన భార్య.. భర్త మృతి





