అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలుడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం తన సోదరిపై దాడికి ప్రయత్నించాడు. ఆపై అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఈ మధ్య కాలంలో హత్యలు విపరీతంగా పెరిగిపోయాయి. కారణం ఏంటో తెలియకుండానే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ నాలుగేళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్నాడో వ్యక్తి. మట్టి తేవడానికి బాలికతో పొలం వద్దకు వెళ్లిన ఆ బాలుడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. అయితే అసలు విషయం తెలిశాక అందరూ అయ్యో ఎంత పని జరిగిందే? అంటూ బోరున విలపిస్తున్నారు. మరి ఆ వ్యక్తి బాలుడిని ఎందుకు చంపాడు? అనే విషయానికొస్తే
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామంలో వెంకటేశ్ – రమ్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె – ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ ఇద్దరి కుమారుల్లో చిన్న కుమారుడు సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు సోదరితో కలిసి మట్టి తేవడానికి పోలానికి వెళ్లాడు.
గొడ్డలితో దాడి
ఆ సమయంలోనే వీరిద్దరూ ముర్రం కోటేశ్వరరావు కంట పడ్డారు. దీంతో వెంటనే కోటేశ్వరరావు గొడ్డలితో ఆ బాలుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ముర్రం కోటేశ్వర రావు తన సోదరిపై కూడా దాడికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఎంతో చాకచక్యంగా అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయింది.
దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కోటేశ్వరరావుకు మతిస్థిమితం లేదని తెలిసింది. అందువల్లనే అతడి భార్య కొంత కాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Andhra News: ఆపినా ఆగకుండా దూసుకెళ్లిన కారు.. చేజింగ్ చేసి తనిఖీ చేయగా..
- Andhra Pradesh: కూతురు పెళ్లికి సహకరించిన వ్యక్తిపై పగపెంచుకున్న ఓ తండ్రి.. ఏం చేశాడో తెలుసా..?
- అప్పా, అమ్మా నన్ను క్షమించండి.. మీ పావన
- Guntur: సైకో మంజు టార్గెట్ చేస్తే మిస్ అవ్వదు.. జైలుకు వెళ్ళొచ్చినా మారని బుద్ధి..!
- Andhra Pradesh: వీళ్లేం మనుషులురా బాబు .. మతిస్థిమితం లేని మహిళను గెంటేయడమే కాకుండా..!