హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన కలకలం రేపింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించడమే కాకుండా రూమ్‌లో బందించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్,ఒక ఆపిల్ ల్యాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఏ1 నిందితుడు శుభమ్కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన నిందితులిద్దరూ గతంలో తేవర్ బార్ లో పనిచేశారు. మూడు నెలల క్రితం ఈ ఇద్దరినీ బార్ ఓనర్ పనిలో నుంచి తీసివేశాడు. ఇది మనసులో పెట్టుకునే దోపిడీకి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read
- శనైశ్చరి అమావాస్య: ఒక్క పని చేస్తే చాలు.. శని దోషాలు పోయి, లక్ డైరెక్ట్‌గా ఇంటికే వస్తుంది!
- గరుడ పురాణంలో పేర్కొన్న పాపులకు 28 ఘోరమైన శిక్షలు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పామర్రు వివాహిత హత్య కేసు.. 24 గంటల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు..
- ఒత్తిడి తట్టుకోలేక జూనియర్ వైద్యుడి ఆత్మహత్యాయత్నం





