వైసీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక టీడీపీ సీనియర్ కార్యకర్త శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
చీరాల : వైసీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక టీడీపి సీనియర్ కార్యకర్త శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరిపాలెంలో చోటుచేసుకుంది. సూసైడ్ నోట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కావూరిపాలెం పరిధిలోని బొగ్గులవారిపాలెంకు చెందిన కోట వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి(50) 32 ఏళ్లుగా టీడీపి లో చురుగ్గా పని చేసేవారు. ఇటీవల గ్రామంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో సీఎం చంద్రబాబును కించపరిచే పాటలు పెట్టొద్దన్నందుకు స్థానిక వైసీపీ కార్యకర్తలు ఆయన్ను వేధించసాగారు. అతని కుటుంబంతో గ్రామస్థులు ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన బుజ్జిరెడ్డి ఈ నెల ఒకటిన పురుగుమందు తాగారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొంది, వారం కిందటే గ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి వైసీపీ వాళ్ల వేధింపులు ఇంకా పెరగడంతో శనివారం తెల్లవారుజామున తన ఇంటి ఎదుట పందిరికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ‘నా ఆత్మహత్యకు వైసీపీ కు చెందిన కుంచాల పొట్టయ్య, కుంచాల చిన్న, కావూరి ఎర్ర శ్రీనివాసరెడ్డి కారణం. వారిని శిక్షించాలి’ అని బుజ్జిరెడ్డి జేబులో లభించిన లేఖలో రాసి ఉంది. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.
Also read
- నేటి జాతకములు..4 ఏప్రిల్, 2025
- శ్రీ కృష్ణుడు మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం ద్వారకాధీష ఆలయం.. ప్రాముఖ్యత ఏమిటంటే
- Dreams Theory: ముద్దు పెట్టుకుంటున్నట్లు కల కంటున్నారా.. ఆ కలకు అర్ధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- కామదా ఏకాదశి: స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా శుభ సమయం? నియమాలు
- Horoscope April 2025: ఏప్రిల్లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..