ప్రేమ పేరుతో మరో మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా అంటూ యువతికి అల్టిమేటం జారీ చేశాడు. ఆ విద్యార్థి నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏకంగా చున్నికి నిప్పంటించి యువతిపై వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణం కడప జిల్లా బద్వేల్లో చోటు చేసుకుంది. నన్ను ప్రేమించు, లేదంటే చనిపోతా అని విద్యార్దినిని బెదిరించారు విగ్నేష్ అనే 20 ఏళ్ల యువకుడు.. ఈ క్రమంలో ఆ బాలికను సెంచరీ ప్లై ఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. అతను చెప్పిన దానికి యువతి అంగీకరించకపోవడంతో ఆమెకు నిప్పంటించినట్లు తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం వేళ.. హైవే 67పై కొనఊపిరితో యువతి కొట్టుమిట్టాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు చికిత్స కోసం ఆమెను 108 వాహనంలో బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బద్వేల్ రామాంజనేయ నగర్‌కు చెందిన యువతి ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.
అయితే.. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పేర్కొంటున్నారు. ముందు యువతిని మాట్లాడాలని పిలిచి.. ఆ తర్వాత చున్నీకి నిప్పంటించినట్లు సమాచారం.. తనను ప్రేమించకపోతే.. చంపుతానంటూ బెదిరించినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బాధితురాలికి బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు
Also read
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు





