ఓ వ్యక్తి కొబ్బరి కాయలు కొట్టే కత్తి తో నేరుగా పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు. మహిళను దారుణంగా హత్య చేశానంటూ లొంగిపోయాడు. దీంతో షాకైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మహిళను కత్తితో తీవ్రంగా పొడిచి చంపి, ఆ తరువాత కత్తి పట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. నేనే చంపనంటూ. కత్తి పోలీస్ స్టేషన్ ఎదుట పడవేసి, లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి వద్ద బోల్లు మల్లవ్వ(60) అనే వృద్ధురాలిని ఓ యువకుడు అతి దారుణంగా కొబ్బరి బొండాల కత్తి నరికి చంపారు. పోలీస్ స్టేషన్ కూతవేటి దూరంలో జరిగింది ఈ సంఘటన. మహిళను దారుణంగా నరికి చంపుతుండగా అక్కడే ఉన్నవారు నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయములో కాపుకాసి, ఎదురు చూసిన దుండగుడు ఒకేసారి ఆమె మీద పడి విచక్షణ రహితంగా నరికి చంపాడు.
హత్య చేసిన వ్యక్తి మహిళకు సమీప బంధువు బొల్లు మనోజ్‌గా పోలీసులు గుర్తించారు హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. హత్య చేసిన వ్యక్తి గతంలో కూడా ఓ హత్య కేసుతోపాటు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రి తరలించారు. భూ వివాదాల కారణంగా నే ఈ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదిలావుంటే, తమకు న్యాయం జరగాలని, హత్య చేసిన వ్యక్తిని మాకు అప్పచెప్పాలని మృతురాలి బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంత సముదాయించిన వినలేదు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ హత్య తరువాత గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు
Also read
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..
- బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది..? విమానంలో ఏ భాగంలో ఉంటుంది..? ఇది గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రశ్న