సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్‌లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బావి నీళ్లు తాగిన కాసేపటికే గ్రామంలోని పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే బీసీ కాలనీవాసులు..
సంగారెడ్డి, అక్టోబర్ 13: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్‌లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బావి నీళ్లు తాగిన కాసేపటికే గ్రామంలోని పలువురు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే బీసీ కాలనీవాసులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వీరిని హుటాహుటీన పలు ఆస్పత్రులకు తరలించగా.. వైద్యులు చికిత్స ప్రారంభించారు. కలుషిత నీరు తగిన వారిలో ఇద్దరు మృతి చెందగా… పలువురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మృతులను మహేష్ (22), సాయమ్మ (70)గా గుర్తించారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రులలో 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.
బావిలోని నీరు తాగడంతో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు జనాలు క్యూ కడుతున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అస్వస్థకు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. గ్రామస్థుల పాలిట యమపాశంలా మారిన బావి నీళ్లను ఎవరూ తాగకూడదంటూ అధికారులు ప్రకటించారు
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!