మంగళగిరి (గుంటూరు జిల్లా) గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కామాంధులు రెచ్చిపోయారు. 24 గంటల వ్యవధిలో రత్నాల చెరువు, బాలాజీనగర్‌లో ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నాలు జరిగాయి. శుక్రవారం జరిగిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. శనివారం రాత్రి నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు మీడియాకు ఆదివారం వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి నగర పరిధిలోని రత్నాల చెరువుకుచెందిన 7వ తరగతి చదువుతున్న మైనర్‌పై అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల గుంటూరు వెంకటేశ్వరరావు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా నిద్రపోతున్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో నిద్రలేచిన బాలిక బిగ్గరగా అరుస్తూ బయటకు పరిగెత్తి పక్కింటి వారికి విషయం చెప్పింది. సమాచారం అందుకును బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా మంగళగిరి నగర పరిధిలోని బాలాజీనగర్‌లో ఏదేళ్ళ బాలికపై అదే ప్రాంతానికి చెందిన వడ్రంగి పని చేసుకునే 60 ఏళ్ల చింతక్రింది వెంకటేశ్వరరావు అత్యాచారానికి యతిుంచాడు. ఈలోపు బాలిక తల్లిదండ్రులు రావడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025