SGSTV NEWS online
Andhra Pradesh

Duvvada Srinivas: దువ్వాడకి టెక్కలిలో  ఉన్న ఒక్క ఇంటిని దువ్వెసిన దువ్వెన  

భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ శ్రీనివాస్.. మాధురి పేరుతో ఇల్లు రిజిస్ట్రేషన్



టీవీ సీరియల్స్‌కి ఎండ్‌ కార్డ్‌ పడుతుందేమోకానీ… టెక్కలి థియేటర్‌లో ఆడుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఇప్పట్లో ఎండ్‌ కార్డ్‌ పడేలా లేదు. పూటకో అప్‌డేట్‌, రోజుకో ట్విస్ట్‌తో… థ్రిల్లర్‌ సిరీస్‌ని మించిపోతోంది. అయితే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్‌ ఒక ఎత్తయితే… లేటెస్ట్‌గా చోటుచేసుకున్న ట్విస్ట్‌ మతిపోగొడుతోంది. ఇంట్లోకి వెళ్లొచ్చని వాణికి కోర్టు పర్మిషన్‌ ఇవ్వగానే… ఇంట్లో తళుక్కున మెరిసింది మాదురి.


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన దువ్వాడ ఫ్యామిలీ వివాదం… ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో వివాదం రోజుకో టర్న్‌ తీసుకుంటుంది. పరిష్కారానికి దారేదనే కన్‌ఫ్యూజనే తప్పా ఎలాంటి క్లారిటీ రావడంలేదు. అయితే లేటెస్ట్‌గా ఈ దువ్వాడ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ చేటుచేసుకుంది. వాణి, తన పిల్లలు ఇంట్లోకి వెళ్లొచ్చని కోర్టు పర్మిషన్‌ ఇవ్వడంతో… అక్కడికి చేరుకున్న వారికి షాక్‌ తగిలింది. ఇంటి బాల్కనీలో మాధురిని కనిపించడం అవాక్కయ్యేలా చేసింది.

ఇక మాధురిని ఇంట్లో చూసిన వాణి, ఆమె తరుపు బంధువులు… ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను ఇంట్లోకి పంపించాల్సిందేనంటూ అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లోకి వెళ్లే హక్కు తనకు, తన పిల్లలకి ఉందంటూ.. కోర్టు చెప్పినా… ఎందుకు ఇంట్లోకి పంపించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఇంటి పవర్‌ను కట్‌ చేసి… ఇంటి ముందు కూర్చుని ఆందోళన కంటిన్యూ చేశారు వాణి.

నా ఇంట్లో నేనున్నాను… వాళ్లెవరు నా ఇంట్లోకి రావడానికి అంటూ వాణి తీరుపై మాధురి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్లు తనదేనని.. దువ్వాడ శ్రీను ఇంటిని తన పేరు మీద రాశారని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ చూపించారు మాధురి.


రిజిస్ట్రేషన్‌ ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదంటోంది దువ్వాడ వాణి. కోర్టు పర్మిషన్‌ తెచ్చుకుంటున్నామని తెలిపి… హుటాహుటిన ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నంత మాత్రన తనదైపోదంటున్నారు వాణి. ఇంటి కోసం ఎలాంటి ఫైట్‌కైనా సిద్ధమంటున్నారు. మొత్తంగా… గత నెల రోజుల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ దువ్వాడ ఎపిసోడ్‌.. ఇంకెంత దూరం వెళ్తుందో… చూడాలి



తాజా వార్తలు చదవండి

Related posts