ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చిన్నారులతో సహా తల్లి మరణించింది. ఈ ఘటన రాయచోటి రాయచోటి పట్టణం తోగట వీధిలో జరిగింది. తొగట వీధిలోని రాజా ఇంట్లో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తల్లి, కుమారుడు, కుమార్తెలకు మంటలు అంటుకుని ముగ్గురూ మృతి చెందారు. ఇంట్లో నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. మృతులు రమాదేవి (34), మనోహర్ (9), మన్విత (5) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా.. రమాదేవి భర్త రాజా జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. రమాదేవి పట్టణంలో టైలరింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. ఇంట్లో పొగలు వస్తుండడంతో ప్రక్కనున్న వారు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారని పేర్కొన్నారు. వారొచ్చేటప్పటికే.. అప్పటికే తల్లి, కొడుకు, కూతురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదమా లేక మరేమైనా కుట్ర జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్ర శేఖర్ వెల్లడించారు.
అయితే.. భార్యాభర్తల మధ్య గత కొంతకాలం నుంచి తరచూ గొడవలు జరుగుతున్నాయని.. ఆ గొడవలే ఈ ఘటనకు దారి తీశాయా..? అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమరాల రికార్డింగులను పరిశీలించి త్వరలోనే నిజా నిజాలను తేలుస్తామని తెలిపారు
Also read
- నన్ను చంపాలని అనేకసార్లు ప్రయత్నించారు.. జోగి రమేష్ కోడలు మేఘన
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..





